స్టేట్ న్యూస్ తెలుగు,20 అక్టోబర్ (నిజామాబాద్)
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు రైతులకు ఇచ్చిన హామీలకు కట్టుబడి వాటిని వెంటనే అమలుపరచాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి. కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. తేదీ 20 10 2024 ఆదివారం రోజున అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా కేంద్రంలో గల ఎన్ఆర్ భవన్ లో జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర అధ్యక్షులు వి కోటేశ్వరరావు మాట్లాడుతూ., కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలు చేపడుతున్నాయని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం చారిత్రాత్మక రైతు ఉద్యమానికి ఇచ్చిన లిఖితపూర్వక హామీ, వ్యవసాయ రంగంలో తెచ్చిన మూడు నల్ల చట్టాలను ఉపసంహరించుకొని ఎంఎస్పి మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకువస్తానని రైతు అప్పులను మాఫీ చేస్తానని విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకొని రైతులపై మోపబడిన కేసులు అన్నింటిని ఎత్తివేస్తానని ఉద్యమ సమయంలో మరణించిన కుటుంబాలను ఆదుకుంటానని రైతులందరికీ పరిహారం చెల్లించి వారిని ఆదుకుంటానని, ఇచ్చిన హామీలు అమలు చేయలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాల్లో కార్పొరేట్ కంపెనీలకు పెద్దపీట వేస్తున్నారని పంట భూములను పారిశ్రామికవేత్తలకు బడా కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే విధానాలను అవలంబిస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైతం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం అవుతున్నారని ఈ జిల్లాలో మూతపడిన రెండు చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని అందుకుగాను మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో సబ్ కమిటీని వేశారని ఇలా కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించి నడిపించాలని డిమాండ్ చేశారు. ఎన్ సి ఎస్ ఎఫ్ సారంగాపూర్ చక్కర ఫ్యాక్టరీని బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నడిపించాలని అన్నారు. బెల్లం కు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని పైగా దీనికి జిఎస్టి ఉండదని ఈ ప్రాంత రైతులు ఫ్యాక్టరీ తెరిస్తే చెరుకు పండించేందుకు సిద్ధంగా ఉన్నారని వారన్నారు. వరి పంట కోతకొచ్చినందున కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం లేదని కోతలు ప్రారంభమై రైతులుపంట ఆరబోసుకుంటున్నందున వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ఈ ఖరీఫ్ పంట నుంచి చెల్లించాలని ఇది అన్ని రకాల పంటలకు అమలు పరచాలని అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రెండు లక్షల రుణమాఫీ అమలుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, ప్రధాన కార్యదర్శి సాయి రెడ్డి, ఉపాధ్యక్షులు ఎర్రయ్య. టి కృష్ణ గౌడ్ సహాయ కార్యదర్శి ఏ చిన్నయ్య. శ్రీనివాస్ రెడ్డి బాబురావు. మార్క్స్ .గోపాల్ విటల్. తదితరులు పాల్గొన్నారు.