అల్లూరి జిల్లా,దేవి పట్నం, సెప్టెంబర్19.(స్టేట్ న్యూస్ తెలుగు):
నిజంగా అర్హులైన అభ్యర్థులకు మాత్రమే పశువుల మీనీ గోకులాలు మంజూరు చేయాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ మాట్లాడుతూ…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశుసంపద కలిగిన రైతులకు పశువుల మినీ గోకులాలు మంజూరు చేస్తామని గత నెల ఆగస్టు 23 తేదీన జరిగిన గ్రామ సభలలో అధికారులు తెలియజేశారు.అయితే షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 1/59, 1/70,మరియు పీసా చట్టం అమలులో ఉన్నందున పశుసంపద కలిగిన అదివాసులకు మాత్రమే మంజూరు చేయాలని,మైదాన ప్రాంతవాసులకు మంజూరు చేయవద్దని,మరియు ఎటువంటి బినామీ వ్యవస్థ లేకుండా పశుసంపద కలిగిన రైతులు ఉన్నారా లేదని ప్రాథమికంగా నిర్ధారించిన తరువాతనే పశువుల మినీ గోకులాలు మంజూరు చేయాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు.