స్టేట్ న్యూస్ తెలుగు,30 డిసెంబర్ (హైదరాబాద్):
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా మాజీ
ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. మన్మోహన్ సింగ్ చేసిన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆర్బీఐ గవర్నర్,ఆర్థిక వేత్తగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన కీలక పదవుల్లో కొనసాగారని తెలిపారు. ఆయన హయాంలోనే తెలంగాణ ఏర్పాటు జరిగిందని కొనియాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలను గుర్తిస్తూ భారత రత్న ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రివెంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
RELATED ARTICLES