స్టేట్ న్యూస్ తెలుగు,21 ఆగస్టు(భద్రాచలం)
ఆగస్టు 31 మరియు సెప్టెంబర్ 1న రెండు రోజులపాటు హైదరాబాదులోని బాలానగర్ లో జరగబోయే రాష్ట్ర స్థాయి బెంచ్ ప్రెస్ పోటీలకు, భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ నుండి 10 మంది ఎంపికైనట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు భోగాల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.మాస్టర్స్ విభాగంలో, డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్,మహంతి వెంకట కృష్ణాజి( సుధా జ్యువెలర్స్ అధినేత ), కోమండ్ల వేణు, పి.రామకృష్ణ, ఇండ్ల శ్రీనివాసరావు,గాలి రామ్మోహన్రావు( నేషనల్ గోల్డ్ మెడలిస్ట్).జూనియర్స్ విభాగంలో, నిశాంత్,భాను,మోతుకూరి పవన్,రవి వర్మ.
మహిళల విభాగంలో, మామిడి భూమిక ఎంపికైనట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.,ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులను అక్టోబర్ నెలలో 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి బెంచ్ ప్రెస్ పోటీలకు ఎంపిక అవుతారని తెలిపారు.
ఈ ఎంపికైన క్రీడాకారులను,పట్టణ ప్రముఖులు మరియు,పలు క్రీడా సంఘాలు,రాజకీయ నాయకులు,గ్రీన్ భద్రాద్రి టీం సభ్యులు,రాష్ట్రస్థాయి పవర్ లిప్టింగ్ ఉపాధ్యక్షులు వి మల్లేష్, జిల్లా అధ్యక్షులు భోగాల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సెక్రటరీ మరియు కోచ్ జివిరామిరెడ్డి, పట్టణ ప్రముఖ సంఘ సేవకుడు గాదె మాధవరెడ్డి, సిటీ స్టైల్ జిమ్ సభ్యులు అభినందించారు.