స్టేట్ న్యూస్ తెలుగు,24 ఆగస్టు(ఖమ్మం)
హైదరాబాదులోని బాలానగర్ లో ఆగస్టు 31 మరియు సెప్టెంబర్ 1 న రెండు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి బెంచ్ ప్రెస్ పోటీల లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి ఈ పోటీలను విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ ప్రధాన కార్యదర్శి జివి రామిరెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అందరూ జిమ్ కోచ్ లకు మరియు జిమ్ ప్రోప్రైటర్స్ కి తెలియజేయునది ఏమనగా మీ జిమ్ లో ఈ పోటీలో పాల్గొనడానికి ఆసక్తి కనబరిచినటువంటి క్రీడాకారులను 26వ తేదీ లోపు జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ రామిరెడ్డి కి పూర్తి వివరాలను పంపగలరు. ఈ పోటీలో బంగారు పతకాలు సాధించిన విద్యార్థులకు అక్టోబర్ నెలలో గోవాలో జరిగే నేషనల్ బెంచ్ ప్రెస్ పోటీలకు ఎంపిక చేయబడతారని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. మరిన్ని వివరములకు జిల్లా ప్రధాన కార్యదర్శి జివి రామిరెడ్డి 9966588688 నెంబర్ను సంప్రదించగలరు.