స్టేట్ న్యూస్ తెలుగు,24 సెప్టెంబర్ (ఖమ్మం)
సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేసే ముందు వినియోగదారులు ఖచ్చితంగా డాక్యుమెంట్స్/పత్రాలు వెరిఫికేషన్ చేసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం ఓ ప్రకటన తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిర్వహిస్తున్న విస్తృత తనిఖీలో సెకండ్ హ్యాండ్ ఫైనాన్స్ ద్వారా తీసుకున్న ద్విచక్ర వాహనాలకు సరియైన పత్రాలు, నెంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్ లేకుండా పట్టుబడిన నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని సెకండ్ హ్యాండ్ ఆటో ఫైనాన్స్ లో వున్న వాహనాల పత్రాలు తనిఖీ చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించామని తెలిపారు. కొంతమంది సెకండ్ హ్యాండ్ ఫైనాన్సర్లు ఫైనాన్స్ లో తీసుకున్న వాహనాలకు నెలవారీ వాయిదాలు చెల్లించలేని ద్విచక్ర వాహనాలను నిభందనలు విరుద్ధంగా సీజ్ చేసి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేకుండా బహిరంగ వేలం ద్వారా పత్రాలు లేకుండా, రిజిస్ట్రేషన్ చేయకుండా అమ్మేసి మిగతా డబ్బు రికవరీ చేసుకుంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేశామని తెలిపారు. ముఖ్యంగా ఎవరైనా వ్యక్తులు వాహనాలు కొనుగోలు, అమ్మకాలు చేసినట్లయితే పత్రాలు పరిశీలించి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ మార్పు చేసుకోవాలని లేదంటే ఎదైనా నేరాలలో మీ వాహనాలు వున్నట్లు గుర్తిస్తే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్, దొంగతనాలు చేసే నిందుతులు పోలీసుల నుండి సీసీ కెమెరాల నుండి తప్పించుకునేందుకు ద్విచక్ర వాహనాల నెంబరు ప్లేట్ లను తొలగిస్తున్నారని అన్నారు. అదేవిధంగా చోరి చేసిన వాహనాలతోనే ఎక్కువ నేరాలు చేస్తున్నారని పెర్కొన్నారు.
ఉద్దేశ్యపూర్వకంగా నిబంధనలు అతిక్రమించి జరిమానాలు తప్పించుకునేందుకు నెంబర్ ప్లేట్ ను వంచినా, ముగుసు వేసినా, పూర్తిగా లేకుండా చేసిన వారని గుర్తించి వారి వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించామని తెలిపారు. ప్రస్తుతం నంబర్ లేకుండా పట్టుబడిన వాహన పత్రాలు, చాయిస్ నెంబర్లు తనిఖీ చేయాలని, అలాగే చోరికి గురైన వాహనాలు ఏమైనా వున్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. వాహనాల కొనుగోలు సమయంలో అయా వాహనలపై పోలీసు కేసులు నమోదు చేశారో లేదో తెలుసుకోవాలని, బీమా, ఆర్‌సి బుక్, ఛేసిస్ నంబర్, తయారీ తేదీ, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి అన్ని పత్రాలను తప్పనిసరిగా సరిచూసుకోవాలని అన్నారు.