స్టేట్ న్యూస్ తెలుగు,14 సెప్టెంబర్ (ఖమ్మం)
ఖమ్మంజిల్లా నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామానికి చెందిన డా.గుగ్గిళ్ళ దివ్యమూర్తికి రామదాసు సాహితి కళాసేవా సంస్థ అవార్డు వరించింది. ఈ అవార్డు ను డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో రామదాసు సాహితీ కళ సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపకులు ప్రముఖ కవి డా.దూత రామ కోటేశ్వరరావు చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది.

తదనంతరం డా. దివ్యమూర్తిని సంస్థ వారు శాలువాతో సన్మానించడం జరిగింది. డా.దివ్యమూర్తి మాట్లాడుతూ., అవార్డు రావడం తనకు సంతోషంగా ఉంది అన్నారు. ఇప్పటివరకు తనకు 44 అవార్డులు వచ్చాయని తెలియజేశారు. ఇప్పటివరకు 72 చోట్ల సన్మానం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దూత రామలక్ష్మి, గజవల్లి సత్యనారాయణస్వామి, వీధి దుర్గారావు, రవిశేఖర్, మోదేపల్లి శీనమ్మ, బోనగిరి ఉమాదేవి, కాసిం, బ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.