స్టేట్ న్యూస్ తెలుగు, 13 సెప్టెంబర్ (భద్రాచలం)
భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కు చెందిన మోడం వంశి అనే పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 8 వరకు జరిగిన ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఇండియాకు బంగారు పతకం తీసుకురావడం జరిగింది. వచ్చే నెల 4వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు
సౌత్ ఆఫ్రికా లోని సన్ సిటీ లో జరిగే కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు తెలంగాణ నుండీ భారత్ దేశానికి ఎంపిక అవ్వడం జరిగింది.సౌత్ ఆఫ్రికాలో జరిగే పవర్ లిఫ్టింగ్ పోటీలకు రాను పోను ఖర్చులకు 1,60,000 చెల్లించవలసి ఉన్నది. రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి ని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు కలిసి వినతిపత్రం అందించడం జరిగింది. అంతేకాకుండా భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు స్పోర్ట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి తో ఫోన్లో మాట్లాడటంతో పాటు, ఏమ్మెల్యే సిఫార్సు లెటర్ కూడా శివసేనా రెడ్డి కి ఇవ్వడం జరిగింది. దీంతో స్పందించిన శివసేనా రెడ్డి చొరవతో, LESINIO క్రీడా యాప్ వ్యవస్థాపకురాలు పట్నం అనూష రెడ్డి మేడం స్పందించి ఇంటర్నేషనల్ పవర్ లిప్టర్ మోడల్ వంశీకి లక్ష రూపాయల చెక్కును ఆర్థిక సహాయంగా , చైర్మన్ శివసేనారెడ్డి, స్పోర్ట్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్ , వీసీ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి సమక్షంలో ఈ చెక్కును అందజేయడం జరిగింది.ఈ ఆర్థిక సహాయం అందించినందుకు అనూష రెడ్డి కి మరియు స్పోర్ట్ చైర్మన్ శివసేనా రెడ్డి కి, జిల్లా పవర్ లిప్టింగ్ అసోసియేషన్ మరియు రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రత్యేక అభినందనలు తెలిపారు.