అల్లూరి జిల్లా,దేవి పట్నం, సెప్టెంబర్22.(దేవిపట్నం)
ఆదివాసి నిరుద్యోగులంత ఈ నెల 23 వ,తేదీ ఉదయం 10 గంటలకు రంపచోడవరం ఐటిడిఏ కు తరలిరావాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ మాట్లాడుతూ… ఆదివాసి ఉపాధ్యాయ ట్రైనింగ్ పొందిన నిరుద్యోగులకు ప్రత్యేక డిఎస్సి ప్రకటించాలని, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్టి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని,ఆశ్రమ పాఠశాలలో ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేయాలని,షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియమకాల చట్టం చెయ్యాలని అలాగే ఆదివాసి నిరుద్యోగులు ఎదుర్కొంటున్న మొదలైన సమస్యలపై ఈ నెల 23వ,తేదీన రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి వినతి పత్రం ఇవ్వటానికి తరలిరావాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ పిలుపునిచ్చారు.