స్టేట్ న్యూస్ తెలుగు, 17 మే (భద్రాచలం):
మే 5 నుంచి 12 వరకు ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో బంగారు పతకాలు సాధించినందుకు భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కు చెందిన క్రీడాకారుడు మోడెం వంశి ని భద్రాచలం ప్రధమ శ్రేణి న్యాయమూర్తి శివ నాయక్ అభినందించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.,అంతర్జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో బంగారు పతకాలు సాధించి భారతదేశము యొక్క ఖ్యాతిని వినువీధులలో, ప్రకాశింప చేసిన, ఆదివాసి జాతి రత్నం, మోడెం వంశీ ఆని అభినందించారు.అంతేకాకుండా మారుమూల ఏజెన్సీ ప్రాంతం నుంచి ఒక ఆదివాసి గిరిజన యువకుడు ఇంటర్నేషనల్ స్థాయిలో బంగారు పతకాలు సాధించడం భద్రాచలం డివిజనకే గర్వకారణం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఇది యువతకు స్ఫూర్తినిచ్చే గొప్ప విషయం అని కూడా తెలిపారు.తను కుడా ఒకప్పుడు కరాటే లో బ్లాక్ బెల్ట్ సాధించాను అని చెప్పి, తన తమ్ముడు కూడా జూడో లో స్టేట్ గోల్డ్ మెడల్ సాధించిన విషయం గుర్తు చేశారు.అప్పట్లో మాకు ఎలాంటి సహాయ సహకారాలు అందక క్రీడలను విడిచిపెట్టాము అని గతం తెలియ చేశారు.కానీ మోడెం వంశీ కి భద్రాద్రి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు వెన్నంటి ఉండి తనను ఈ స్థాయికి తీసుకుని వచ్చినందుకు సభ్యులను ప్రత్యేకంగా కొనియాడారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కోచ్ జీవి రామిరెడ్డి, వైద్యులు డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్, సీనియర్ న్యాయవాదులు రావి రామ్మోహన్రావు, పామరాజు తిరుమల్ రావు, సాధన పల్లి సతీష్, డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ గుగులోతు శోభ నాయక్, తదితరులు పాల్గొన్నారు.