అల్లూరి జిల్లా, రంపచోడవరం, సెప్టెంబర్ 25( దేవిపట్నం)
ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పర్యాటక ప్రాంతాలలో ప్రదేశాలలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ మాట్లాడుతూ…షెడ్యూల్డ్ ప్రాంతమైన ఏజెన్సీ ప్రాంతాల్లో ఏపీ టూరిజం డెవలప్మెంట్లో భాగంగా పర్యాటక ప్రదేశాలలో ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాకపోవటంతో మైదాన ప్రాంతాల నుండి వచ్చిన పర్యాటకులు పర్యటించిన ప్రాంతాల గురించి వివరించడానికి గైడ్ లేక పోవటంతో అలాగే పూర్తి అవగాహన లేక పోవటంతో మైదాన ప్రాంతాల నుండి వచ్చిన పర్యాటకులు అనుకోకుండా తరచూ జలపాతాలు వద్ద మృత్యువాత పడుతున్నారు. ఉదాహరణకు ఇటీవల మెడికల్ కాలేజీ విద్యార్థులు మృత్యువాత పడిన జల తరంగిణి జల పాతం వద్ద అటవీశాఖ అధికారులే టోకెన్ తీసుకుంటే కానీ జల పాతం వద్దకు అనుమతించరు.ప్రభుత్వ అధికారులే నిర్వహిస్తున్న జల తరంగిణి జల పాతం వద్ద గైడ్ లేక పోవటం వలనే ఈ సంఘటన జరిగింది.కావున ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి పర్యాటక ప్రదేశాలలో గైడ్లను నియమించాలని,హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని మరియు పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యాటక ప్రదేశాలలో అత్యధిక ప్లాస్టిక్ వాడకం నిషేధం అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు.