స్టేట్ న్యూస్ తెలుగు, 26 ఆగస్టు (భద్రాచలం)
చర్ల జూనియర్ ప్రభుత్వ కళాశాల ఓ లెక్చరర్ పై నోడల్ అధికారులు తక్షణమే విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని రాష్ట్ర గోండ్వానా సంక్షేమ పరిషత్ పాయం సత్యనారాయణ, మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు ముత్తవరపు జానకిరామ్, లీగల్ అడ్వైజర్ పర్షిక సోమరాజు డిమాండ్ చేశారు
భద్రాచలం ఐటీడీఏ ఆవరణలో మానవహక్కుల సంఘము జిల్లా అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర గోండ్వాన సంక్షేమ పరిషత్ అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ., చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ చదువుతున్న విద్యార్థినిల పట్ల ఓ అధ్యాపకుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని పిల్లల పట్ల బూతులు మాట్లాడుతున్నారని, పిల్లలను మానసికంగా హింసిస్తున్నారని, పిల్లల పైన చేతులు వేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే నోడల్ అధికారులు, సంబంధిత అధికారులు ఈ విషయం పైన కళాశాలకు వెళ్లి చదువుతున్న ప్రధమ ద్వితీయ విద్యార్థినిలను విచారణ చేపట్టి వారి నుండి విషయాలు సేకరించి తక్షణమే ఆ యొక్క లెక్చరర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేనియెడల భద్రాచలం ఐటీడీఏ ఎదుట ఆదివాసీల మహిళ విద్యార్థినీలతో ధర్నా చేసి న్యాయపోరాటం చేస్తావని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జూనియర్ అడ్వకేట్ కోర్స నరేష్,కాక సురేష్ పాల్గొన్నారు.