11వేల 440 కోట్ల భారీ ప్రాజెక్ట్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
స్టేట్ న్యూస్ తెలుగు,17 జనవరి (హైదరాబాద్): విశాఖ స్టీల్ ప్లాంట్ కు మంచి రోజులు వచ్చాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేంద్రప్రభుత్వం 11 వేల 440 కోట్ల తో భారీ ప్రాజెక్ట్ ప్రకటించింది.ఈ ప్యాకేజి తో స్టీల్ ప్లాంట్ కి మంచి రోజులు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశాభావాన్ని వ్యక్త పరుస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో..ఈ ప్యాకేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పారు.స్టీల్ ప్లాంట్
లాభాలు అర్జించడానికి ఈ ప్యాకేజి ఎంతో ఉపయోగ పడుతుందని అంతే కాదు ఎన్డీయే ప్రభుత్వానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని రామ్మోహన్నాయుడు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.