
జులై 4న ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభను
విజయవంతం చేద్దాం అని నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్ లు టిపిసిసి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి
కొండేటి మల్లయ్య ,సానం శ్రీనివాస్ గౌడ్ పిలుపు నిచ్చారు.
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా
ఈరోజు అచ్చంపేట పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ…అచ్చంపేట నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో గ్రామస్థాయి నాయకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. టిపిసిసి ఉపాధ్యక్షులు,అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు అచ్చంపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనం
వహించడం జరుగుతుంది గ్రామ కమిటీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు బ్లాక్ అద్యక్షులు పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో అచ్చంపేట నియోజకవర్గం నుండి పాల్గొని విజయవంతం చేయగలరని అన్నారు.ఈ సభకు ముఖ్యఅతిథిగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు పాల్గొంటారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు , ఉమామహేశ్వర దేవస్థానం చైర్మన్ మాధవరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కట్టా అనంతరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ సోమ్లా,రాఘవులు, ఖాదర్, బాబా, బాలరాజ్, ఐఎన్టియుసి అధ్యక్షులు మహబూబ్ అలీ, యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు