నేలకొండపల్లిలో గ్రామీణ వికాస కేంద్రం పిలక్సోనియా, సత్య ట్రస్ట్ ఆధ్వర్యంలో అందరూ చదవాలి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
స్టేట్ న్యూస్ తెలుగు : నేలకొండపల్లి / ఖమ్మం
కేంద్రంలో పిలక్సోనియా, సత్య ట్రస్ట్ ఆధ్వర్యంలో అందరూ చదవాలి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్ష్యరాస్యుల అభ్యున్నతికి అందుబాటులోకి తీసుకురావడమే ముఖ్య ఉద్దేశ్యంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొంతైనా చదవటం, రాయటం నేర్పించడం లక్ష్యంగా చేపట్టారు. వాలంటీర్ కె. సద్గుణ కుమార్, నేలకొండపల్లి మండల కేంద్రంలో నిరక్షరాస్యులైన సుమారు 30 మందికి శిక్షణ అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి గాంధీ పదం మండల కన్వీనర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రెడ్డిమల్ల బాబూరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల సార్వత్రిక అభివృద్ధికి ఈ కార్యక్రమం ఒక ప్రేరణగా నిలుస్తుందని ముఖ్య అతిథులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గుడిబొయిన వెంకన్న, రామకృష్ణ, మామిడి వెంకటేశ్వర్లు, చిర్రా ప్రవీణ్, కడియాల నరేష్, ఇతర గణనీయులు పాల్గొన్నారు.