అల్లూరి జిల్లా, దేవీపట్నం,
నంబరు 7.(స్టేట్ న్యూస్ తెలుగు)
మాతృశ్రీ గండి పోచమ్మ తల్లి గుడి ప్రదేశంలో భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించాలని ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ మాట్లాడుతూ… అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండలం,పూడి పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని
గొందూరు గ్రామంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన మాతృశ్రీ గండి పోచమ్మ తల్లి గుడి ప్రదేశంలో భక్తుల సౌకర్యార్థం అనేకమైన మౌలిక సదుపాయాలు తక్షణమే కల్పించాలని సంబంధిత అధికారులకు డిమాండ్ చేశారు.గోదావరి పరివాహక ప్రాంతమైన మాతృశ్రీ గండి పోచమ్మ తల్లి ఆలయం చూట్టు గోదావరి వరదనీరు పూర్తిగా తగ్గిపోవడంతో కార్తీక మాసం ప్రారంభం కావడంతో భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో అనేకమంది భక్తులు గండి పోచమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించడానికి వచ్చినవారికి గోదావరి నదిలో స్నానం చేయడానికి ఆలయ అధికారులు అనుమతులు లేవంటున్నారు.అయితే ప్రత్యామ్నాయంగా గోదావరి నీళ్లు తో స్నానం చేయడానికి , మహిళల సౌకర్యార్థం బాత్రూం అధిక సంఖ్యలో ఏర్పాటు ఏర్పాటుచేసి మాలిక వసతులు కల్పించలేకపోయారన్నారు.మాతృశ్రీ పోచమ్మ తల్లి గుడి ప్రదేశం నుండి బోటు పాయింట్ ఉండడం వలన పాపికొండల విహారయాత్రకు వచ్చే భక్తులు రోజురోజుకీ పెరగడంతో విశ్రాంతి భవనాలు,డైనింగ్ హాల్స్ లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారనీ,.మాతృశ్రీ గండి పోచమ్మ తల్లి ఆలయాన్ని దర్శించడానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగాకుండా ఆలయ అధికారులు తక్షణమే స్పందించి పోచమ్మ తల్లి గుడి ప్రదేశంలో త్వరితిగతిన మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులకు ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కారం రామన్న దొర, ఆదివాసీ జేఏసీ దేవీ పట్నం మండల కార్యదర్శి యలగాడ నాగేశ్వరావు మొదలైనవారు పాల్గొన్నారు.