Saturday, January 18, 2025

పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేసి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి!.. AIKMS జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య డిమాండ్…


స్టేట్ న్యూస్ తెలుగు,30 సెప్టెంబర్ (నిజామాబాద్)

స్టేట్ న్యూస్ తెలుగు,30 సెప్టెంబర్ (నిజామాబాద్ ): రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు పూర్తిస్తాయిలో రెండు లక్షల రూపాయల ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేసి అన్ని రకాల పంటలకు క్వింటలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని అఖిల భారత రైతు కూలి సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు.తేదీ 30- 9 -2024 సోమవారం రోజున అర్సపల్లిలో లో ఏ .ఐ. కె .ఎం.ఏస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో భూమయ్య మాట్లాడుతూ., కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు బోనస్ ఇస్తానన్న నేపథ్యంలో అదికూడా సన్నాళ్లకే వర్తింపచేస్తామని చెప్పడంతో రైతులు అధిక సంఖ్యలో సన్నాలు వేశారని, పంటకూడ చేతికి వస్తుందని ప్రభుత్వం వెంటనే బోనస్ ప్రకటించి మద్దతు ధరతో కలిపి రైతుల ఖాతాలో క్వింటలకు 500 రూపాయలు బోనస్ వేయాలని భూమయ్య అన్నారు. ఈ జిల్లాలో కోతలు ప్రారంభమవుతున్నాయి కానీ ప్రభుత్వం ఎప్పటిలాగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో మీనామేశాలు లెక్కపెడుతుంది. కోతలు ప్రారంభమైన ప్రాంతాలలో వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారన్నారు. భోధన్ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారస్తులు పచ్చి వడ్లనే కొనేందుకు వస్తున్నారని వారు అన్నారు.
ప్రభుత్వం 8 నెలల పాలనలో రైతులకు పూర్తిస్థాయిలో రుణ మాఫీ చేయలేదని వరన్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో రెండు లక్షలు రుణ మాఫీ అమలు చేసి రాబోయే రబీ సీజన్ లో రైతులకు కొత్త రుణాలు అందించాలని వారన్నారు.దీనితోపాటు ఖరీఫ్ సీజన్లో చివరి దశకు చేరి పంట చేతికి వస్తున్నా కూడా నేటికీ రైతుకు రైతు భరోసాను ఇవ్వలేదు ఎకరానికి 7500 ఇస్తానన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా హామీపై రైతులకు అనుమానం కలుగుతుందని వారన్నారు.ఇప్పటికైనా రైతు భరోసా ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఏ .ఐ. కె .ఎం.ఏస్ జిల్లా గౌరవ అధ్యక్షులు నాయకవాడి నర్సయ్య,ఉపాధ్యక్షులు టి .కృష్ణ గౌడ్, బి సాయిలు నాయకులు గోపాల్, ఎన్ లక్షమన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular