Saturday, January 18, 2025

తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నీ కలిసిన భద్రాద్రి జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు

స్టేట్ న్యూస్ తెలుగు,10 సెప్టెంబర్ (భద్రాచలం)

  • తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ వైస్ చైర్మన్ అండ్ మేనేజిం
    భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కు చెందిన మోడెం వంశి అనే పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు, ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 8 వరకు యూరప్ ఖండంలోని మాల్టా దేశంలో జరిగిన ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో మిగతా క్రీడాకారులతో తలపడి భారతదేశానికి బంగారు పతకం సాధించడం జరిగింది. వచ్చే అక్టోబర్ నెల 4వ తేదీ నుండి 13వ తేదీ వరకు సౌత్ ఆఫ్రికా లోని సన్ సిటీలో జరిగే కామన్వెల్త్ గేమ్స్ లో పవర్ లిఫ్టింగ్ పోటీలకు తెలంగాణ తరుపున భారతదేశానికి ఎంపిక అవ్వడం జరిగింది. ఈ పోటీలకు రానుపోను మరియు వీసా ఖర్చులకు గాను, రెండు లక్షల రూపాయలను పవర్ లిఫ్టింగ్ ఆఫ్ ఇండియా కు చెల్లించవలసి ఉంది. క్రితం మాల్టా దేశంలో అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనుటకు రెండు లక్షల 50వేల రూపాయలు అవసరమవగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్, ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడి సమకూర్చి పంపించడం జరిగింది. ఈసారి సౌత్ ఆఫ్రికా లో జరిగే పోటీల కోసం అవసరమయ్యే రెండు లక్షల రూపాయలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి గారి కలిసి అభ్యర్థించి నివేదించటం జరిగింది.
    ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జివి రామిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్, కోశాధికారి మహంతి కృష్ణాజి (నేషనల్ పవర్ లిఫ్టర్) మోడెం వంశీ( ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టర్) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular