స్టేట్ న్యూస్ తెలుగు,11 ఆగస్టు(ఖమ్మం)
గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో గ్రామస్థులకు విష జ్వరాలు వచ్చి కీళ్ల నొప్పులతో భాడపడుతుండగా గ్రామానికి చెందిన మండల మాజీ జెడ్పీటీసీ కోట సామ్యూల్ అభ్యర్థన మేరకు మధిర లోని కేవిఆర్ జనరల్ అండ్ ఎమర్జెన్సీ హాస్పిటల్స్ వారి ఆద్వర్యంలో హాస్పిటల్ అధినేత /డా.కోట రాంబాబు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ వైద్య శిబిరంలో జ్వరాలతో, కీళ్ల నొప్పులతో మరియు వివిధ రోగాలతో బాధ పడుతున్న వారికి తగిన రక్త పరీక్షలు ఉచితంగా చేసి రోగానికి తగిన మందులు ఉచితంగా ఇచ్చారు. అడిగిందే తడువుగా విష జ్వరాలతో సతమతం అవతున్న గ్రామస్తుల భాద అర్థం చేసుకొని వెంటనే వచ్చి ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన డా కోట. రాంబాబు కు గ్రామస్తులు మరియు ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.